ప్రముఖ జర్నలిస్టు శంకర్ పై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా జర్నలిస్టు శంకర్ పై అటాక్ చేశారు. మొత్తం 15 మంది దుండగులు… జర్నలిస్టు శంకర్ పై దాడి చేశారని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. హైదరాబాదులోని ఎల్బీనగర్ లో జర్నలిస్టు శంకర్ పై దాడి జరిగినట్లు సమాచారం అందుతుంది.
అతని కారుపై దాడి చేసి అనంతరం శంకర్ ను దారుణంగా కొట్టారట. దీంతో వెంటనే జర్నలిస్టు శంకర్ను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలోనే శంకర్ చికిత్స పొందుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు దాడి చేసినట్లు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.