తెలంగాణ తల్లి విగ్రహం మీద జెసిబితో దాడికి కాంగ్రెస్ యత్నం ?

-

Attempt to attack Telangana mother’s status with JCB: కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మరో దారుణానికి ఒడిగట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం మీద జెసిబితో దాడికి యత్నం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో ఉద్రిక్తత తెలంగాణ తల్లి విగ్రహం తొలగించాలని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. 10 రోజుల క్రితం విగ్రహం ఏర్పాటు చేశారు కొంతమంది గ్రామస్తులు.

Attempt to attack Telangana mother’s status with JCB

అయితే.. ఈ విగ్రహానికి అనుమతి లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ తరుణంలోనే… పోలీసు పహారా మధ్య జెసిబి తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేయడంతో అడ్డుకుని తిట్టారు గ్రామస్తులు. గ్రామ పంచాయితీ సిబ్బంది, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది విగ్రహం తొలగింపు వివాదం. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడి నుండి వెనుదిరిగారు పోలీసు అధికారులు, సిబ్బంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version