మాజీ మంత్రి మల్లారెడ్డికి చుక్కెదురు

-

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. దూలపల్లి లోని మల్లారెడ్డి వర్సిటీ …..బాలానగర్ లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ పేరుతో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

High Court shock for former minister of Telangana state Mallareddy

విచారణ చేపట్టిన హైకోర్టు వర్సిటీతో పాటు ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక అటు BRS మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరి రాకను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.

దీంతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి త్వరలో అన్ని అడ్డంకులను క్లియర్ చేసి మామా అల్లుళ్లను కాంగ్రెస్‌లోకి తెస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందని, వారం రోజుల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ను వీడతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version