తెలంగాణలో ఆరమ్‌ ఈక్విటీ పార్ట్‌నర్స్‌రూ.3,350 కోట్ల పెట్టుబడులు

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన బిజీబిజీగా సాగుతోంది. తాజాగా ఆయన కాలిఫోర్నియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికాలోని పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్లో సుమారు 3 వేల 350 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో నెక్స్ట్-జనరేషన్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్‌ నిర్మించనున్నట్లు తెలిపింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ సంస్థ సీఈవో, ఛైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతో పాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం సంతోషకరమని.. దీనివల్ల భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news