తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్ ఫెడ్ కు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 64.175 ఎకరాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెసర పంట సాగు అయిందని ఈ సందర్భంగా ప్రకటించారు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు.
ఈ నేపథ్యంలో 17841 మెట్రిక్ టన్నుల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెసర దిగుబడి రావచ్చని కూడా ఆయన అంచనాలు వేశారు. ప్రస్తుతం 12 ప్రాంతాలలో పంట కోతకు వచ్చిందని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. పెసర పంటకు ప్రభుత్వం మద్దతు ధర 8682 రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెసర కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని కూడా ఆదేశాలు ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.