తెలంగాణ, ఏపీ ప్రజలకు అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తూర్పు-మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఆవర్తనం విస్తరించి ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతో తూర్పు మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల, కొమురం భీం, అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, ఖమ్మం, జనగాం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని….గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో అక్కడక్కడ గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇటు ఏపీలోనూ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.