కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో అజారుద్దీన్ ?

-

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో అజారుద్దీన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. తనకు కాకుండా అమీర్ ఆలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అజారుద్దీన్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ పెద్దలు నాకు హామీ ఇచ్చారు కానీ ఇవ్వలేదని అజారుద్దీన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

Azharuddin planning to resign from the Congress party

పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా వేరే వాళ్లకు ఎలా ఎమ్మెల్సీలు ఇస్తారని ఫైర్‌ అయ్యారు. నేను పార్టీ కోసం 18 ఏండ్లుగా పని చేస్తున్నాను. ఏఐసిసి పెద్దలతో మాట్లాడిన తరువాత నా నిర్ణయం ప్రకటిస్తాను అంటున్నారు అజారుద్దీన్. అయితే.. అజారుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో అజారుద్దీన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో… అజారుద్దీన్ కాంగ్రెస్‌ పార్టీ తరఫున జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news