ఈనెల 15వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో అధికార పార్టీ సమరభేరికి సన్నద్ధమవుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆరోజున తెలంగాణ భవన్​లో పార్టీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమై.. ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అదే రోజున నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు బీ ఫారాలను కేసీఆర్ అందించనున్నారు. 15వ తేదీన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు.

brs party

అనంతరం అదేరోజు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడి నుంచి వరుసగా జిల్లా పర్యటనల్లో పాల్గొననున్న కేసీఆర్.. ఈనెల 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్లలలో… 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news