బీటెక్ విద్యార్థులకు షాక్.. సెకండ్ ఇయర్​లో బ్రాంచ్​ మార్పు రద్దు

-

విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటంతో వాటిని నిరోధించేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్ తొలి ఏడాది పూర్తయ్యాక మెరిట్ ప్రాదిపదికన రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచ్​లోకి మారే వెసులుబాటును రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీలు, ఎన్​ఐటీలకు ఆదేశాలు జారీ చేసింది. దాన్ని అమలు చేస్తూ ఐఐటీ బాంబే తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ తొలి ఏడాదిలో అత్యధిక గ్రేడ్‌ పాయింట్లు సాధిస్తే రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచిని దక్కించుకునే అవకాశముంది. అందుకు 10% సీట్లు కేటాయిస్తారు.

2023-24 విద్యా సంవత్సరం నుంచి అలాంటి అవకాశాన్ని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. గత నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణపైనే సుదీర్ఘంగా చర్చ సాగింది. వాటిని ఆపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఒత్తిడికి ఒక ప్రధాన కారణమైన బ్రాంచి మార్పును రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version