బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని పవన్‌ చెబుతున్నారు – BJP MP GVL

-

బీజేపీ,జనసేన,టీడీపీ పొత్తు పెట్టుకోవాలని పవన్‌ చెబుతున్నారని BJP MP GVL నరసింహా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేనతో పొత్తుల్లో ఉన్నాం….టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ తీసుకు వచ్చారని వెల్లడించారు. అదే విషయాన్ని మా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లాం., పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారని తెలిపారు.

పొత్తులపై అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వమే….. దేశంలో అడుగు పెట్ట డానికే ద్వారం లేని కమ్యూనిస్టులు…. మాకు దక్షిణ ద్వారం ముతపడిందని చెప్పడం హ్యాస్యాస్పదం అని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సానుకూల ఫలితాలు ఖాయం అని చెప్పారు. కావలిలో బీజేపీ నాయకులపై పోలీసులు దాష్టీకం తీవ్రమైన అభ్యంతర కరం…..ఈరోజు సాయంత్రం లోగా సస్పెండ్ చెయ్యకపోతే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.డిఎస్పీ రమణారావు పై చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోమ్ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు BJP MP GVL నరసింహా రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version