బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన ధరలు

-

దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మాఘ మాసం కావడంతో  ఈ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌ లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాబోయే  రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది.

తాజాగా ఫిబ్రవరి 19న దేశంలో బంగారం ధరలు పెరిగాయి. తులం బంగారంపై స్వల్పంగానే పెరిగినప్పటికీ ఇప్పటి వరకు భారీగానే పెరుగుతూ వస్తోంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,710 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1లక్ష 400 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news