రేపు ఢిల్లీకి సీఎం.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా..!

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం.. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనే.. ఎందుకంటే.. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.

CM Chandrababu

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. దీంతో ఎల్లుండి జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రాంలీల మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. ఢిల్లీ సీఎం ఎవరు కానున్నారనేది ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ బీజేపీ శాసన సభ జరగనుంది. ఈ సమావేశంలో సీఎం ఎవరు అనే దానిపై స్పష్టత రానుంది. రాంలీల మైదానంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news