2023లో బీజేపీదే అధికారం..కిషన్‌ రెడ్డినే సీఎం : బండి సంజయ్‌

-

వివాదస్పద వ్యాఖ్యలు, సంచలనాలకు మారు పేరు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌. అయితే.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌ కుమార్‌. 2023 లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి రేస్‌లో లేనని… కిషన్‌రెడ్డి నాకు మధ్య పోటీ పెడితే కిషన్‌రెడ్డినే సీఎం అవుతారని చెప్పారు. పార్టీని అధికారంలోకి తేవడమే నా బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

హిందువులారా…తెలంగాణలో హిందూ రాజ్యం తీసుకురావాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన మహనీయుడైన శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి రావడం దురద్రుష్టకరమని చెప్పారు. శివాజీ బీజేపీ నాయకుడు కాదు… భరతమాత ముద్దు బిడ్డ. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడిన నేత అని తెలిపారు.ఈ రాష్ర్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్లు తమ మతాన్ని చెప్పుకుంటే బాధ లేదు.. కానీ హిందువులు మాత్రం తాను హిందువునని చెప్పుకోలేని దుస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version