రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధి అమ్మపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయం ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం లేకుండా గర్భగుడిలో సీతారామచంద్రస్వామిలు కొలువుదీరారు. ఈ ఆలయాన్ని 13 శతాబ్ధంలో వేంగి చాలుక్యులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. సీతమ్మవారు కొలువై వున్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’ అనే పేరు వచ్చింది. ఇదిలా ఉంటే అమ్మపల్లి ఆలయంలో నిత్యం సినిమా షూటింగ్‌లు జరగడం విశేషం.