త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” తెస్తామని..కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎంకు పనిపాట లేక గంటల తరబడి మీడియా సమావేశం పెడుతున్నారని.. వయో భారం కారణంగా సీఎం కేసీఆర్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. సమస్యలు సృష్టించి ప్రజల దృష్టిని ప్రభుత్వంపై నుంచి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని.. పారాబాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి, కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పి, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్ట సమగ్రవిధానం లేక, కేంద్రం పై సి.ఎమ్ ఆరోపణలు చేస్తున్నారని… ఖరీఫ్ సీజన్ (వర్షాకాలం) లో ఇవ్వాల్సిన పంట ఇంకా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. బియ్యం కుంభకోణంలో టీఆర్ఎస్ నేతల బండారం బయట పడుతుందన్న భయంతో వేరే అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మధ్యవర్తిగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేక చేతులు ఎత్తేసి కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నారని.. ఇన్ని రోజులు బియ్యం కొనుగోలు చేయాలని కోరి, ఇప్పుడేమో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. “కాశ్మీర్ ఫైల్స్” కు వ్యతిరేకంగా మాట్లాడే ముఖ్యమంత్రి కి డీఎన్ఎ టెస్ట్ చెయ్యాలని.. పాకిస్థాన్, చైనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.