105 సీట్లు కాదు..వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు 10 సీట్లే వస్తాయి : బండి సంజయ్‌

-

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు 105 సీట్లు.. కాదు 10 సీట్లే వస్తాయని బండి సంజయ్‌ చురకలు అంటించారు. బీజేపీ పార్టీకి 95 సీట్లు రాబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలు చూసి బేజారయిన ముఖ్యమంత్రి కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి జంకుతున్నారని.. త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయని హెచ్చరించారు. తెలంగాణ లో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారని.. భోధన్ లో బిజెపి కార్యకర్తలు , హిందువులపై కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు.

కేసీఆర్ ఎంతమంది స్ట్రాటజిస్ట్ లను తెచ్చుకున్నా బిజెపిని ఏం చెయ్యలేరని.. అవినీతి యూపీఎ పాలనలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ భాగస్వామి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రధాని భారత ప్రభుత్వాన్ని, విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తుంటే … కేసీఆర్ మాత్రం విమర్శలు చేస్తున్నారని.. ఇమ్రాన్ కు ఉన్న బుద్ధి, కేసీఆర్ కు లేదని ఆగ్రహించారు. ఉక్రెయిన్ విధ్యార్ధులను స్వదేశానికి రప్పించిన ఘనత కేంద్రానిది అయితే… కేసీఆర్ తన ఘనతగా చెప్పుకుంటున్నారని.. కేసీఆర్ ఒక మోసకారి, నిత్యం రాజకీయాలతో కాలం గడుపుతున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version