కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజల స్వయం ఉపాధి కల నెరవేర్చడానికి ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) సొంతగా వ్యాపారం చేసుకోవాలి అనుకునేవారు ఈ పథకం ద్వారా డబ్బులను రుణంగా ఇస్తున్నారు. 2017 ఏప్రిల్ 8న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కార్పొరేట్ కాకుండా వ్యవసాయతర, చిన్న పరిశ్రమలకు 20 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ లైన్ కాక,దేశవ్యాప్తంగా ఈ పథకం కింద లక్షల మంది ఆర్థిక సహాయం అందుకున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
ముద్ర రుణాల లక్ష్యం : ముద్ర పథకం ఉత్పాదన వాణిజ్య సేవలు, వ్యవసాయ సంబంధిత పనులకు సంబంధించిన చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించడం. ఈ రుణాలు కోలాటరల్ రహితంగా ఉంటాయి. ఇవి చిన్న వ్యాపారం చేసుకునేవారికి ఆర్థిక భారం లేకుండా వ్యాపారం ప్రారంభించడానికి, విస్తరించడానికి సహాయపడుతుంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడమే కాక కుట్టుమిషన్లు, కిరాణా షాపు వంటి వాటికి రుణాలు అందించడం. తెలంగాణలో ఈ పథకం ప్రత్యేకించి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ముద్ర కార్డు : ప్రధానమంత్రి ముద్ర యోజన కింద చిన్న వ్యాపారులకు 50 వేల నుంచి 20 లక్షల వరకు హామీ లేకుండా రుణాలు ఇస్తారు. బ్యాంకు ద్వారా డైరెక్ట్ గా అకౌంట్లోకి మనీ వచ్చే విదంగా ఈ రుణం మంజూరు చేస్తారు. ఇలాంటి రుణాలు పొందాలనుకునే వారికి ముద్రా కార్డు జారీ చేస్తారు. ఇది మన డెబిట్ కార్డు మాదిరిగా ఉంటుంది. దీని ద్వారా లబ్ధిదారుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుని తీసుకొని వచ్చు.
రుణ విభాగాలు : ముద్రా రుణాలు మూడు భాగాలుగా విభజించారు.
శిశు రుణాలు: కొత్తగా ప్రారంభమయ్యే వ్యాపారులకు రూ.50 వేల వరకు రుణాలు మంజూరు చేయడం శిశు రుణాల కిందకు వస్తుంది.
కిశోర్ రుణాలు : వ్యాపార విస్తరణకు, లబ్ధిదారుడురూ. 50,000 నుండి 5 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
తరుణ్ రుణాలు : బాగా స్థిరపడిన వ్యాపారులకు రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వ్యాపార అభివృద్ధి కోసం రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది.
తరుణ్ ప్లస్: రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు తరుణ్ రుణాలను విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి మరికొంత రుణం మంజూరు చేస్తారు.
అర్హతలు,దరఖాస్తు ప్రక్రియ: తెలంగాణలోని వ్యవస్థాపకులు కమర్షియల్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు,మైక్రో ఫైనాన్స్ సంస్థలు లేదా NBF ల ద్వారా ముద్ర రుణాలను పొందవచ్చు. దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్ లోwww.udyamimitra.in లేదా www.jansamarth.in ద్వారా చేయవచ్చు.అవసరమైన డాక్యుమెంట్ తో, గుర్తింపు పత్రాలను, సమర్పించి పొందవచ్చు. మహిళా వ్యవస్థాపకులకు మహిళా ఉద్యమి యోజన కింద 0.25% వడ్డీ రాయితీ అందుబాటులో ఉంది.
తెలంగాణలో ముద్రా రుణాలు: గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. ఈ రుణాలు ఆటోరిక్షాలు, చిన్న రిటైల్ షాపు, బ్యూటీ పార్లర్లు, ఫుడ్ స్టాల్స్, ఇతర చిన్న తరహా వ్యాపారాలను స్థాపించడానికి సహాయపడ్డాయి. 2024 యూనియన్ బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముద్ర రుణ పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచారు, తరుణ్ ప్లస్ విభాగాన్ని పరిచయం చేశారు. ఇది తెలంగాణలోని వ్యవస్థాపకులకు మరింత ఆర్థిక సహాయం అందించేందుకు దోహదపడుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.23 లక్షల కోట్లు 40 కోట్ల మంది లబ్ధిదారులకు విడుదల చేయబడ్డాయి, తెలంగాణలో 75 లక్షల రుణాలు,అందించారు.రూ.70 వేల కోట్లు మంజూరు చేసారు.