కొత్త సచివాలయం అంబేడ్కర్‌ జయంతిన ప్రారంభించాలి: బండి సంజయ్‌

-

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ దివాళా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో ప్రారంభమైన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిందన్న బండి సంజయ్‌.. 2014కు ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్నో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు నూతన సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజు ప్రారంభిస్తా అన్నారని.. అంబేడ్కర్ పేరు పెట్టి కేసీఆర్ పుట్టినరోజున ఎలా ప్రారంభిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. కొత్త సచివాలయాన్ని అంబేడ్కర్ జయంతిరోజునే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

మద్యం ద్వారా రాష్ట్రంలో ఒక్కో కుటుంబం ఏటా రూ.50 వేలు ప్రభుత్వానికి ముట్టజెపుతుంటే… ప్రభుత్వం మాత్రం ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపుతోందని విమర్శించారు. మోదీ నాయకత్వంలో భారత్ అగ్రపథంలోకి దూసుకు పోతోందన్న సంజయ్… రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పాటు కోసం బీజేపీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు చెప్పారు

Read more RELATED
Recommended to you

Latest news