గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది. కాబట్టి బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది అని పేర్కొన్నారు. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా చేస్తుంది. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర చేస్తుంది అని పేర్కొన్నారు. ధరణిపై భూముల అన్యాక్రాంతంపై శ్వేత పత్రం విడుదల చేయండి.. అసలు ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చింది అని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబ భూదోపిడీపై చర్యలేవి.. కాంగ్రెస్ కు హిందూ పండగలంటే అంత చులకనెందుకు అని రేవంత్ ప్రభుతం పై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలోనే 36 లక్షల మంది ఉంటే… లక్షన్నర లోపు రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం విడ్డూరం. అంటే నూటికి 70 మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలే అని బండి సంజయ్ పేర్కొన్నారు.