హైదరాబాద్ కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్, షూటర్ ఇషాసింగ్, బాక్సర్ నిఖత్ జరీన్ కి 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ మంత్రి వర్గం ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు.
తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. వారితో పాటు తెలంగాణకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు కూడా ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై తాజాగా అంబటి రాయుడు స్పందించారు. ఈ జాబితాలో ఎమ్మెల్యే కౌశిక్ తన పేరును కూడా చేర్చడం పట్ల అంబటి రాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా అవసరమని.. మహ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఏ ప్రభుత్వం నుంచి స్థలం అవసరం లేదని ట్వీట్ చేశారు అంబటి. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.