తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ బహిరంగ లేఖ

-

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ బృందానికి అనుమతివ్వండని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బండి సంజయ్‌ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో బీజేపీ పార్టీ కి చెందిన ఎం.పి.లు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్‌ ఎక్స్‌పర్ట్స్‌,మొత్తం 30 మంది ముఖ్యమైన బీజేపీ నాయకులు వుంటారని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.

కాళేశ్వరం ప్రాజెక్టును సెప్టెంబర్ మొదటి వారంలో బీజేపీ బృందం సందర్శిస్తుందని.. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మాకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని.. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు ఏర్పడిన నష్ణాన్నిపరిశీలించడానికి బీజేపీ బృందం పర్యటన లక్ష్యమని వెల్లడించారు.

1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్‌ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శంచాయని.. 2004 – 2009 లో జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకుప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపు నుండి కూడా ఇరిగేషన్‌ అధికారులను పంపి మా సందేహాలను నివృత్తి చేయండన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version