BREAKING : సీఎం కేసీఆర్‌ కు బండి సంజయ్‌ లేఖ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఈ లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పండిన ప్రత్తి గింజలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో వివరించారు బండి సంజయ్ కుమార్.

ధాన్యం కొనుగోళ్లపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరో ఉద్యమాన్ని తెరపైకి తీసుకు వస్తామని హెచ్చరించారు బండి సంజయ్.ప్లీనరీలో వలసలు ఆగాయని తమ కార్యకర్తలకు సిఎం కెసిఆర్ అబద్ధాలు చెప్పారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.టిఆర్ఎస్ అసమర్థ పాలన లో బతికే దారి లేక ఉపాధి దొరక్క రోజూ వందల మంది ముంబైకి వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version