26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు బంండి సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ లో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు… కానీ బీజేపీ లో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు.
అందుకే వాళ్లు తర్జనభర్జన అవుతున్నారని తెలిపారు బండి సంజయ్. కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ పత్ర్ హామీ మేరకు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారితే వారితో రాజీనామా చేయించి ఆయా స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 26 మంది టచ్‌లో ఉన్నారంటున్న కాంగ్రెస్ పార్టీకి, వారితో రాజీనామా చేయించి గెలిపించుకునేందుకు భయం పట్టుకుందని అన్నారు. నాయకులపై ఈడీ, సీబీఐ కేసులు ఉంటే బీజేపీలోకి తీసుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. యుతవకు ఉద్యోగాల్లేక తల్లడిల్లుతుంటే కాంగ్రెస్ నేతలకు ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.