రుణమాఫీలో కోతపెట్టినందుకు..సంబరాలు చేసుకుంటారా? -బండి సంజయ్ ఫైర్‌

-

ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? రబీ, ఖరీఫ్ లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? అంటూ రేవంత్‌ సర్కార్‌ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్‌ అయ్యారు.

పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా? రైతు భరోసా పేరుతో రబీ, ఖరీఫ్ సీజన్ లో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకివ్వలేదు? నిలదీశారు. రబీ, ఖరీఫ్ లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? నూటికి 70 మంది రైతులకు క్షోభ మిగిల్చేలా నిర్ణయం తీసుకున్నందుకా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా తప్ప రైతులపట్ల ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తుశుద్ధి లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news