సుద్దపూస…బామ్మర్థి ఫాంహౌజ్ లోనే రేవ్ పార్టీలా? – బండి సంజయ్‌

-

కేటీఆర్‌ బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీ నిర్వహించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. సుద్దపూస కేటీఆర్.. ఇప్పుడేమంటాడో..?అంటూ చురకలు అంటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో..? అంటూ ఆగ్రహించారు.

bandi sanjay on janwada rave party

సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయ్..! అంటూ బాంబ్‌ పేల్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్​పై రాజీ ధోరణి ఎందుకు? అని నిలదీశారు. సమగ్ర విచారణ జరిపి బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలని డిమాండ్ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news