నేటి నుంచి బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ చేప‌డుతున్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో ద‌శ పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రజా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నిస్తు.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మొద‌టి విడ‌త పాద‌యాత్ర ను బండి సంజయ్ పూర్తి చేశారు. తాజా గా నేటి నుంచి రెండో విడ‌త పాదయాత్ర చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏకైకా శ‌క్తి పీఠం అయిన జోగులాంబ అమ్మవారి ద‌గ్గ‌ర ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హింస్తారు.అనంత‌రం జోగులంబ గ‌ద్వాల జిల్లా నుంచే త‌న పాద‌యాత్ర‌ను బండి సంజ‌య్ ప్రారంభిస్తారు. తొలి రోజు బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జీ త‌రుణ్ చుగ్ రానున్నారు. ఈ రెండో విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్రకు బీజేపీ నాయ‌కులు ఇప్ప‌టికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు.

ఈ యాత్ర దాదాపు 31 రోజుల పాటు సాగ‌నుంది. ఈ పాద‌యాత్ర ముఖ్యంగా ఉమ్మ‌డి పాలమూరు జిల్లాలోనే కొన‌సాగ‌నుంది. పాద‌యాత్ర‌లో భాగంగా తొలి రోజు అలంపూర్ నుంచి ఇమామ్ పూర్ వ‌ర‌కు దాదాపు 4 కిలో మీట‌ర్ల వ‌ర‌కు పాద‌యాత్ర జ‌రుగుతుంది. అనంత‌రం అక్క‌డే బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తారు.