ఆదిలాబాద్ వేదికగా అమిత్ షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపికి అనుకూల వాతావరణం ఉన్నదని తెలిపారు. మా గ్రాఫు తగ్గినట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మేము రాజకీయంగా కొట్లాడుతాం అంతే కాని కెసిఆర్ బాగుండాలని కోరారు. నిజాం కు వ్యతిరేకంగా వచ్చే రజాకా సినిమా అంటే మీకు భయం ఎందుకు అని ప్రశ్నించారు. మీరు నిజాం రజాకార్ల వారసులా ఎంఐఎంఓ బాధపడుతుందని మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. రాహుల్ గాంధీ 50 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తే పెళ్లెప్పుడు పిల్లలు ఎప్పుడూ అంటూ వ్యంగ్యాసం చేశారు. వారంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తే ఎవరు నమ్ముతారని పేర్కొన్నారు.
కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుందన్నారు. కరీంనగర్లో పోటీ చేయాలని ఉందని నా కోరిక చెప్తాను మా అధిష్టానం ఆదేశిస్తే చేస్తానని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్ బిజెపి కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందన్న అమిత్ షా కామెంట్స్ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీరిద్దరూ ఒకటి కాకపోతే ఎంఐ ఎముకు దమ్ముంటే.. మీరు నిజంగా అల్లాని ప్రార్థిస్తే హైదరాబాద్ దాటి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా ఎందుకు మార్చడం లేదన్నది చెప్పాలన్నారు. జనసేనతో పొత్తు గురించి అధిష్టానం చూసుకుంటుంది మాకు ఉన్న సమాచారం ప్రకారం మేము ఒంటరిగానే వెళ్తామన్నారు . ఎంఐ మడ్డగా చెప్పుకున్న భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు అన్ని పార్టీలను రప్పించిన ఘనత మాదే అన్నారు. చివరికి ఎంఐఎం నేతలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం పేరు కల్వరిస్తున్నారని పేర్కొన్నారు బండి సంజయ్. గ్రామాల్లో పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు బండి సంజయ్. పండించిన ప్రతి గింజలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.