నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్ దిట్ట..బాంఛన్‌ బతుకులు వద్దు – బండి సంజయ్‌

-

నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్ దిట్ట..బాంఛన్‌ బతుకులు వద్దని బండి సంజయ్‌ అన్నారు. 100 రోజుల పని దినాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని.. ఉపాధిహామీ పథకం కూలీ డబ్బులను కేంద్రం ప్రతి నెల వారానికి ఒకసారి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. వారినికి ఒకసారి మీ అకౌంట్ లలో డబ్బులు పడాలని.. ఎండాకాలం అదనంగా రూ.20 కూలీ కేంద్రం ఇస్తోందని తెలిపారు.

మోదీ మీ పైసలు ఆపే పరిస్థితి లేదు… ఇక్కడ ఆపేది కేసీఆర్ ప్రభుత్వమేనని.. మీకు అదనంగా 50 రోజుల ఉపాధిహామీ పనిదినాలు పెంచాలని మోదీని కోరుతామని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలతో వినడు… కొట్లాడితేనే వింటాడని.. వారానికి ఒకసారి మీ కూలీడబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రేపే మొత్తం లెక్కలు తెప్పిస్తా… మీకు అన్యాయం చేసిన వాళ్ళ లెక్క చూస్తా…కేసులు పెట్టిస్తా…వాళ్ళను జైలుకి పంపిస్తానని.. మీరు జాగ్రత్తగా పని చేసుకోండన్నారు. కేసీఆర్ బియ్యాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని… పేదలకు బియ్యం, వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ నిధులు ఇస్తుంటే… ఇక్కడ కేసీఆర్ వడ్డించడం లేదని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version