సాయి గణేస్ మరణానికి కారణమైన మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటు అని.. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్త లేదని… నమ్మిన సిద్ధాంతం కోసం తెగించి కొట్లాడే కార్యకర్త సాయి గణేష్ అని పేర్కొన్నారు.
చట్టానికి లోబడి పాలకుల అక్రమాలు, దుర్మార్గాలపై న్యాయ బద్దంగా యుద్దం చేసిన యువకుడు గణేష్ అని.. అలాంటి యువకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
సాయిగణేష్ పోరాటం మరువలేనిదని.. టీఆర్ఎస్ నేతలు గూండాయిజానికి పోలీసుల కండకావరానికి బలైన పోయిన సాయి గణేష్ అని తెలిపారు.
నిరుపేద సామాన్య కార్యకర్త, తల్లిని పోషిస్తూ కష్టపడి పనిచేస్తున్న యువకుడని… సాయి గణేష్ మరో పేద అమ్మాయితో వివాహానికి నిశ్చితార్థం కూడా జరిగిందని వెల్లడించారు. పెళ్లికి రమ్మంటూ నాకూ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిందన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలు, జిల్లా మంత్రి బీజేపీని చూసి భయపడుతున్నారని.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టబోం కచ్చితంగా శిక్షిస్తామని హెచ్చరించారు బండి సంజయ్.