కవితపై బండి వ్యాఖ్యలు..మహిళా కమిషన్‌కు సంచలన లేఖ.!

-

కవితపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణగా బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..మహిళా కమిషన్‌కు సంచలన లేఖ రాశారు. కవితపై తాను చేసిన వ్యాఖ్యలని సమర్ధించుకున్నారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే తాను మాట్లాడినట్లు కమిషన్‌కు సమాధానం ఇచ్చారు. తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు చెప్పుకొచ్చారు. ఇక బండి సమాధానం పట్ల మహిళా కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

అయితే ఇటీవల కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ అంశంపై బండి స్పందిస్తూ..అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక మార్చి 8న బండి వ్యాఖ్యలు చేస్తే..మార్చి 11న కవిత ఈడీ విచారణకు హాజరైన సమయంలో బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేశాయి. బండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ అంశాన్ని డైవర్ట్ చేయడానికి బి‌ఆర్‌ఎస్ శ్రేణులు బండిని టార్గెట్ చేశాయని చెప్పవచ్చు.

ఈ అంశంలో బి‌జే‌పి నేతలు బండిని సమర్ధించారు..అది తెలంగాణ సామెత అని, వాడుక బాషలో మాట్లాడే మాట అని అన్నారు. కానీ బి‌జే‌పి ఎంపీ అరవింద్ మాత్రం బండి వ్యాఖ్యలని ఖండించారు. కవితపై అలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. అరవింద్ కు కొందరు బి‌జే‌పి నేతలు మద్ధతు ఇస్తూ బండిపై ఫైర్ అయ్యారు. ఇటు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం బండి వ్యాఖ్యలని ఖండించారు.

ఇదే క్రమంలో మహిళా కమిషన్ కు ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యంలో..కమిషన్ వివరణ అడుగుతూ బండికి లేఖ రాసింది. ఈ క్రమంలో బండి తన వ్యాఖ్యలని సమర్ధించుకుంటూ మహిళా కమిషన్ కు లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version