కూకట్‌పల్లి కాంగ్రెస్ టికెట్ కోసం బండ్ల గణేష్ వ్యూహాలు ?

-

కూకట్‌పల్లి కాంగ్రెస్ టికెట్ కోసం బండ్ల గణేష్ వ్యూహాలు రచిస్తున్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కమ్మ సామాజిక వర్గానికి ఆ సీటు ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అనూహ్యంగా గణేష్ పేరు తెరపైకి వచ్చింది. కాగా, ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు.

కాగా, ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” సమావేశం జరుగనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ “వార్ రూమ్”లో ఈ సమావేశం జరుగనుంది. అభ్యర్ధుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. వచ్చే మంగళవారం (అక్టోబర్ 10) కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” సమావేశం జరుగనుంది. ఇక వచ్చే మంగళవారం ( అక్టోబర్ 10) తెలంగాణ అసెంబ్లీ టిక్కెట్లను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ.”

Read more RELATED
Recommended to you

Exit mobile version