కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్..పాలేరు నుంచి షర్మిల పోటీ !

-

కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. రేపో, మాపో ప్రకటన ఉంటుందనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ లో వైఎస్ఆర్టిపి విలీనానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. విలీనంపై చర్చించేందుకు షర్మిల పలుమార్లు ఢిల్లీ వెళ్లిన… రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదట. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. షర్మిల పాలేరు నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఇక మిగతా స్థానాలకు కూడా రెండు, మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.

కాగా వైఎస్ షర్మిల గత రెండు సంవత్సరాల కిందట తెలంగాణ వైసిపి పేరుతో పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం పోరాటం చేస్తూనే ఉంది వైయస్ షర్మిల. అయితే ఇప్పటివరకు ఆమె పార్టీలో బలమైన నాయకులు చేరకపోవడం, తదితర కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు సిద్ధమయ్యారు షర్మిల. కాని చివరికి షర్మిలకు నిరాశ మిగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version