Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

-

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. ఈ విషయం ఈమె నామినేషన్ వేసినప్పటి నుండి విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో బర్రెలక్క కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుంది.

Barrelakka Sirisha Cast Her Vote

అయితే..కాసేపటి క్రితమే.. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తన ఓటు హక్కును వినియోగించుకుంది. పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె బందోబస్తు మధ్య పోలింగడ్ కేంద్రానికి వచ్చిన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అయితే ఆమెకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. మరి ఈ ఎన్నికల్లో శిరీష అలియాస్ బర్రెలక్క సంచలనం సృష్టిస్తుందా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news