ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం మెట్టుపల్లె సమయంలో ఆవుకు రెండో టన్నెల్ ను జాతికి అంకితం చేసి పైలాన్ ను ఆవిష్కరించారు.
రిజర్వాయర్ నుంచి అదనంగా 10,000 క్యూసెక్కులు వెరసి మొత్తం 20,000 క్యూసెక్కుల నీటిని ఆవుకు రిజర్వాయర్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో 567 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన రెండో సొరంగం పనుల ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయడం పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.