తగ్గేదేలే…యూనిఫాం వేసుకుని బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన !

-

తగ్గేదేలే…యూనిఫాం వేసుకుని బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు బెటాలియన్ కానిస్టేబుల్స్. తమ సమస్యలు వీడియో రూపంలో LED స్క్రీన్ మీద చూపిస్తూ ఆందోళన చేస్తున్నారు బెటాలియన్ కానిస్టేబుల్స్. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ ధర్నాకు దిగారు పోలీసులు. జిల్లా కేంద్రంలోని 17వ. బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర నిరసన, ధర్నాకు దిగారు పోలీసులు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

Battalion constables

తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు డ్యూటీలు వేసి మాకు, మా సంసారాన్ని కుటుంబాన్ని దూరం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు పరుచాలని డిమాండ్ చేస్తున్నారు. మాతోని లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చెపిస్తున్నారని ఆందోళనకు దిగారు. సంబధం లేని పోలీసు డ్యూటీలు వేసి వాగులో ఇసుక, దొంగతనంగా మిషన్ భగీరథ పైపులు దొంగతనంగా తేవాలని కమాండెంట్ హుకుం వేసాడని పైపులు తెచ్చామని అంటున్నారు పోలీసులు. మా పై ఆంధ్ర అధికారుల పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు కానిస్టేబుల్స్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version