బతుకమ్మ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

-

మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ మొదలైంది. ఈసారి చీరలు చాలా అందంగా ఉన్నాయని రాష్ట్ర ఆడబిడ్డలు సంబుర పడుతున్నారు.

ఈ క్రమంలో సద్దుల బతుకమ్మ సమీపిస్తున్న వేళ ఏర్పాట్లపై అధికారులు సమావేశమయ్యారు. బతుకమ్మ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై బీఆర్కే భవన్​లో సమన్వయ సమావేశం జరిగింది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్​ రెడ్డి భేటీ అయ్యారు. బతుకమ్మ వేడుకల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

గతేడాది కంటే రెండింతలు వైభవంగా ఈసారి బతుకమ్మ సంబురాలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. బతుకమ్మ సంబురాల్లో ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version