హైకోర్టును ఆశ్రయించిన సన్నీ యాదవ్

-

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ మాఫియాకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, సినీతారలపై కేసులు నమోదు చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో తెలుగు మోటోవ్లాగర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ బయ్యా సన్నీ యాదవ్ కూడా ఉన్నాడు. విచారణకు హాజరు కావాలని సన్నీ యాదవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సన్నీ యాదవ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.  ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో సన్నీపై కేసు నమోదయింది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం అతడు హైకోర్టును ఆశ్రయించాడు. సన్నీ వ్యాజ్యంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది. ఇక కేసు నమోదయ్యాక సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిపై లుకౌట్ నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version