ఆశా వర్కర్లను పోలీసులు ఇష్టమొచ్చినట్టు కొట్టడం దుర్మార్గం : హరీశ్ రావు

-

ఆశా వర్కర్లను పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టడం దుర్మార్గం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తాజాగా ఎక్స్ వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నమని గొప్పలు చెబుతూ, మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తమని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామి ఇచ్చారు.

ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ అశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గం. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసించే హక్కు లేదా? సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్చ లేదా? తెలంగాణ ఏర్పాటుకు మందు ఆశాల గౌరవ వేతనం రూ. 1500 మాత్రమే ఉంటే, కేసీఆర్ గారు రూ. 10వేలకు పెంచి వారి సేవలను గుర్తించారు, వారిని గౌరవించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ప్రశ్నిస్తే పోలీసులతో పళ్లూడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ, ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు” అని ట్వీట్ చేశారు హరీశ్ రావు. 

Read more RELATED
Recommended to you

Latest news