తెలంగాణలో గతేడాది రికార్డు స్థాయిలో మందుబాబులు మద్యం తాగేశారు. ఇప్పుడు ఎండా కాలంలో కావడంతో.. జనాలు విపరీతంగా బీర్లు తాగుతున్నారు. గడిచిన 18 రోజుల్లో 670 కోట్ల రూపాయల బీర్లు తాగేశారని తెలంగాణ మందుబాబులు. దీంతో గత సంవత్సరం కంటే 28.7 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని చెబుతున్నారు.
తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. కాగా 2023లో రూ.36,151 కోట్లకుపైగా విలువైన 3.58కోట్ల కేసుల లిక్కర్, 5.34 కోట్ల కేసుల బీర్‌ను మందుబాబులు తాగారు. 2022లో కంటే దాదాపు రెండు వేల కోట్లు విలువైన మద్యాన్నిఅధికంగా మద్యం ప్రియులు తాగినట్లు ఆబ్కారీ శాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి.