టాలీవుడ్ హీరోలకు మరో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో బెన్ఫిట్ షో లు కూడా రద్దుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో తమ డిమాండ్లు నెరవేరే వరకు బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు ఓ ప్రకటన ద్వారా చెప్పినట్లు సమాచారం.
తాము కోరుకున్న విధంగా నిర్మాతలు పర్సంటేజ్లు ఇవ్వాలని… మొదటినుంచి తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే థియేటర్లను మూసివేశారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సంటేజ్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు. ఇందుకు జూన్ ఒకటవ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు కూడా వివరించారు.
కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు లాంటి సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు పేర్కొన్నట్లు సమాచారం అందుతుంది. మిగతా ఏ సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు ఇవ్వబోమని చెప్పారట. మరి దీనిపై నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ బెనిఫిట్స్ షోలు లేకపోతే… సినిమా బృందానికి తీవ్ర నష్టమే కాకుండా… సినిమాపై హైప్ కూడా తగ్గిపోతుంది.