భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య.. మండల అధ్యక్షుడిపై బూతు పురాణం !

భద్రాచలం ఎంఎల్ఎ పొదెం వీరయ్య ఓ నాయకుడిపై బూతు పురాణం వదిలాడు. పార్టీ సభ్యత్వాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించారని అంటూనే ఈ బూతు పురాణం చేపట్టాడు. పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడుగా ఉన్న ఇగ్బాల్ పట్ల ఇలా దురుసుగా మాట్లాడాడు.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నుంచి ఎంఎల్ఎ గా ఉన్న పొదెం వీరయ్య ప్రస్తుం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అద్యక్షుడుగా కూడ ఉన్నాడు. అదే విదంగా టిపిసిసి ఉపాధ్యక్షుడుగా కూడ కొనసాగుతున్నాడు.

ఎంఎల్ఎ పట్ల కొంత మంది వ్యతిరేకిస్తు పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేశాడన్న అనుమానం మీద క్రింది స్థాయి నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బూతులు చాలా దారుణంగా ఉన్నాయి. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నుంచి ఎంఎల్ఎ గా ఎన్నికైన పొదెం వీరయ్య మొన్నటి 2018 ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యాడు. కాగా ములుగు ఎంఎల్ఎ సీతక్కి ఇటీవల కాలంలో పినపాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఆమెకు పినపాక కు చెందిన కార్యకర్తలు దగ్గరగా ఉంటున్నారు. ఇది కూడ పొదెం వీరయ్యకు ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ బూతు పురాణం వివాదం అవుతుంది.