భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి నీటి మట్ట..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ !

-

భద్రాచలం ప్రజలకు అలర్ట్‌. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలంలో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఈ వర్షాకాలం సీజన్ లో మొదటిసారి భద్రాద్రి గోదావరికి పోటెత్తింది వరద. ప్రస్తుతం 38 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. దీంతో 7 లక్షల 50వేల క్యుసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేశారు.

దుమ్ముగూడెం లోని పర్ణశాల లో నీట మునిగింది నారా చీరల ప్రాంతం. అయితే.. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. 48 అడుగులకు రెండు, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారన్నారు. ఇక గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా అధికార యంత్రాంగం. కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక భద్రాచలంలో వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక.

Read more RELATED
Recommended to you

Latest news