అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. భద్రాద్రిలో ప్రత్యేక పూజలు

-

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో కోట్ల మంది హిందువుల చిరకాల కల సాకారం కాబోతోంది. భారతీయులంతా ఈ వేడుక కోసం ఏళ్ల నుంచి వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని కనులారా వీక్షించడానికి ఇప్పటికే లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్య బాలరాముడు తొలిపూజ అందుకోనున్నారు.

ఈ నేపథ్యంలో రేపు జరగబోయే శ్రీరాముని ప్రాణప్రతిష్టకు రాష్ట్రంలోని భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రేపు (జనవరి 22వ తేదీ) ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు, శోభాయాత్రతో పాటు పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అయోధ్య రాముడి ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. రామయ్య ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని రేపు ఆలయాన్ని భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news