పాలు ఉన్నచోట సంపద ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 51 డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో పాడి ఉత్పత్తి ఒక భాగం అని చెప్పారు. పాలు పొంగించి శుభాలు పొందాలని అన్నారు. పాలు వున్న చోట సంపద ఉంటుందని చెప్పారు.
పాడి ఉత్పత్తి తెలంగాణ ప్రజలకి సంపద లాంటిదని అన్నారు. తెలంగాణలో పాడి ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలు ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇందిర క్రాంతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డైరీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. మహిళలకి పాడి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడానికి ఆర్థికంగా ప్రోత్సహిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.