హైదరాబాద్ విద్యుత్ శాఖ అధికారులకు భట్టి కీలక సూచనలు..!

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్ వినియోగందారులకు ఈ వర్షాకాలంలో ఎలాంతో ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖ నిరంతం ప్ర‌జ‌ల కోసం అంకిత‌మై ప‌నిచేస్తోంది. అర్ద‌రాత్రి, అప‌రాత్రి, వ‌ర్షం వ‌చ్చినా, పిడుగులు ప‌డుతున్నా, మోరీలు పొంగిపోర్లుతున్నా విద్యుత్ అధికారులు ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లూ అందుబాటులో ఉంటారు.

విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా, ఏ స‌మ‌యంలో అయినా 1912 టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు కాల్ చేస్తే త‌క్ష‌ణ‌మే అధికారులు స్పందిస్తారు. మ‌నంద‌రికోసం వారంతా ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరికీ నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలి. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో గాలివాన తదితర ఇబ్బందుల వల్ల కరెంటు స్తంభాలు కూలిపోవడం, విరిగిపోవడం, తీగలు తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలి అని భట్టి సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version