పాడేరు, నర్సీ పట్నం నియోజక వర్గం నేతలతో వైసీపీ అధినేత వైఎస్.జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీచేస్తుంది అంటే దాని అర్థం ఏంటి..? కొనుగోలుచేసి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవాలని చూస్తోంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధంచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను మోసంచేశాడు.
సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు, కానీ మోసం చేస్తున్నాడు. నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అని ప్రచారం చేశాడు. ఎన్నికల్లో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మనం అబద్ధాలు చెప్పి, ఆ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకుంటే మనకు ఏం సంతృప్తి వస్తుంది. కార్యకర్తలనుంచి, ఎమ్మెల్యేలవరకూ తిరిగి గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా..? జగన్ మాట చెప్పాడు, కాని అమలు చేయలేదనే మాట అనిపించుకోకూడదు. మన పార్టీ పేరు చెప్తే కార్యకర్తలు, నాయకులు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు అని గనర్ పేర్కొన్నారు.