అనుమానాలు వద్దు..6 గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం – భట్టి

-

అపోహలు, అనుమానాలు వద్దు..6 గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలే తప్పా విధుల్లో అలసత్వం వహిస్తే సహించమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ప్రభుత్వ ఉద్దేశాలపై దశా దిశా నిర్దేశం చేశారు.

రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజా పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, కలలు నెరవేరాలని కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ప్రజలు కోరుకున్న ఆశలు ఆకాంక్షలు నెరవేరకపోగా వారు కన్న కలలు కల్లలుగా మిగిలిపోవడంతో ప్రజలు మార్పును కోరుకుని ప్రజా (కాంగ్రెస్) ప్రభుత్వం తెచ్చుకున్నారని వివరించారు.

ప్రజలు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం నాది అన్న నమ్మకం భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని, అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని హిత బోధ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version