ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం కూడా మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు ఆయన మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
‘ధనిక రాష్ట్రానికి ఇబ్బందులు ఎందుకు వచ్చాయని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే పరిపాలన చేయలేదని అనేక మంది విమర్శించారు. మేం వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేశాం. సాగునీరు, విద్యుత్ పై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉంది. ప్రజలను ఆందోళనకు నెట్టే ప్రచారం కూడా మంచిది కాదు.’ అని భట్టి విక్రమార్క బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలను ఉద్దేశించి అన్నారు.