సాధారణంగా పెద్ద సినిమాలు వస్తే సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతుంటారు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాకు అలాగే అనుమతి కోరారు. ఒక రోజు ముందే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళా మరణించిన విషయం తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కే గేమ్ ఛేంజర్ మూవీకి ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.
ఈ నేపథ్యంలో జనవరి 12న విడుదలయ్యే డాకు మహారాజ్ మూవీ నిర్మాత నాగవంశీ స్పందించారు. టికెట్ ధరల పెంపు పై ఓ క్లారిటీ ఇచ్చారు. టికెట్ ధరలు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం అడగడం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో మేము హ్యాపీగానే ఉన్నామని వెల్లడించారు నిర్మాత నాగవంశీ.