తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్ .. 36 రైళ్లు రద్దు !

-

తెలుగు ప్రజలకు బిగ్ అలర్ట్.. 36 రైళ్లు రద్దు అయ్యాయి. ట్రాక్ ల నిర్వహణలో భాగంగా 36 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరుపతి-కాట్పాడి మధ్య రెండు రైళ్లను, కాజీపేట-డోర్నకల్, VJA-డోర్నకల్, భద్రాచలం రోడ్-VJA, బల్లర్ష-VJA, కాజీపేట-సిర్పూర్ టౌన్, బల్లార్ష-కాజీపేట, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, SEC-VKB, NZB-కరీంనగర్ వంటి 20 స్టేషన్లలో రైళ్లను ఈ నెల 31 నుంచి ఆగస్టు 7 వరకు రద్దు చేశారు.

VJA డివిజనల్ రైల్వే పరిధిలో 14 రైళ్లను రద్దు చేశారు. అటు ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు 22 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే ట్రాక్ ల నిర్వహణ, మరమ్మత్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దయిన MMTSలో లింగంపల్లి-హైదరాబాద్ 12 రైళ్లు ఉండగా… మిగతా 10 రైళ్లు ఉందానగర్-లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి మధ్య నడిచేవి ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news